#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
#AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న #AA23 ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ బిజినెస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎట్టకేలకు లాక్ అయ్యిందని తెలుస్తోంది. 2027 ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్ గురించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం కళ్లు చెదిరే స్థాయిలో పారితోషికం, లాభాల వాటా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.175 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట. అంతేకాకుండా, సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో బన్నీకి 33 శాతం వాటా దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన లాభాల పంపకం కూడా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు నికర లాభాల్లో 33 శాతం వాటా, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు మిగిలిన 33 శాతం వాటా దక్కేలా ఈ బిజినెస్ డీల్ కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
Also Read
- NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
- Giribabu: భయపెట్టే విలన్, నవ్వించే కమెడియన్.. గిరిబాబు జీవితంలోని ఆసక్తికర కోణాలివే!
- Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
- Giribabu: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
లోకేష్ కనగరాజ్ తన మార్క్ యాక్షన్ శైలిలో అల్లు అర్జున్ కోసం ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కథను సిద్ధం చేశారని టాక్. తాజాగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే పనులు పూర్తి కావడంతో, 2027 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ హై-వోల్టేజ్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండటం అంచనాలను మరింత పెంచుతోంది. భారీ బిజినెస్ లెక్కలతో అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న #AA23, వెండితెరపై ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
-
SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
-
Mississippi River Accident : మిసిసిపీ నదిలో పెను ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ట్యాంకర్
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!