Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫెక్స్ కారణంగా సంవత్సరాల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను మరో సంగీత దర్శకుడు హరి గౌరకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో పాటలకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించగా నేపథ్య సంగీతం విషయంలో మరింత కొత్తదనం కోసం ఆ బాధ్యతను హరి గౌరకు అప్పగించింది. ఇప్పటికే హరి గౌర ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఆర్.ఆర్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం సంగీత దర్శకుడు హరి గౌర ఇప్పటికే ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే ‘మిరాయ్’ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రానికి తనదైన శైలిలో పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవంగా సోషియో ఫాంటసీ సినిమాలకు సంగీతం అందించడంలో కీరవాణికి మంచి అనుభవం ఉంది. కానీ విశ్వంభర మేకర్స్ గౌరహరిని రంగంలోకి దింపుతున్నారు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మ్యూజిక్ పనుల్లో కీరవాణి బిజిగా ఉండడం వలన విశ్వంభర బాక్గ్రౌండ్ కోసం గౌర హరిని తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!