A huge movie directed by Srinu Vaitla: విలక్షణ శైలితో బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్స్ అందించిన దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు శుభవార్తను అందించారు. ‘నీ కోసం’తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రీను వైట్ల. అందరూ కొత్తవారితో నిర్మించిన ‘ఆనందం’తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. ”వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ” తదితర చిత్రాలతో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల ‘దూకుడు’ తో తిరుగులేని హిట్ కొట్టారు.
టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన శ్రీను వైట్ల ఓ అగ్ర హీరోతో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. అద్భుతమైన కథతో పాటు తన మార్క్ వినోదంతో వస్తున్న శ్రీను వైట్ల మరో భారీ విజయాన్ని సాధిస్తారేమో చూద్దాం!!
Vizag Fishing Harbour: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత… మత్స్యకారుల ఆందోళన