Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టి మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తన తరువాత సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే.దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం రాజమౌళి కొన్ని బుక్స్ ను రిఫరెన్స్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత మహేష్ తన తరువాత సినిమాను కూడా త్రివిక్రమ్ తో చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.