పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయట. ఈ చిత్రం కోసం ఓ భారీ షిప్ సెట్ ను నిర్మించారట. అందులో రూపొందించిన 30 నిమిషాల సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయట. ఈ వార్తతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కరోనా పరిస్థితుల్లో సినిమా విడుదల అవుతుందా ? లేదా ? అన్న విషయంపై సందిగ్థత నెలకొంది.