Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సినీ కెరీర్ కు 20 ఏళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఆయన ఎదిగారు.అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాతో ఈ లెక్కల మాష్టారు డైరెక్టర్ గా మారారు.ఆర్య సినిమాతో అప్పటివరకు ఎవరు తీయని విధంగా సరికొత్త ప్రేమకథను తెరకెక్కించారు.ఆర్య సినిమా సుకుమార్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది.ఆర్య సినిమా 7 మే 2004న విడుదల అయి అద్భుత విజయం సాధించింది.ఆర్య సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం నేటికీ 20 ఏళ్ళు పూర్తి అయింది.ఆర్య సినిమా నుంచి సినిమా మేకింగ్ సరికొత్త పంథాను చూపిస్తూ ప్రేక్షకులను సుకుమార్ ఎంతగానో ఆకట్టుకున్నారు.ఆర్య సినిమా తరువాత సుకుమార్ తెరకెక్కించిన రెండో సినిమా ‘జగడం’.సుకుమార్ కెరీర్ లో మరో అద్భుతమైన సినిమా ఇది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఈ సినిమా మాస్ హీరోగా మార్చింది.అప్పటివరకు యూత్ లో ట్రేండింగ్ గా వున్నా గ్యాంగ్స్ ,గొడవలూ ఎంత ప్రమాదకరమో సుకుమార్ అద్భుతంగా చూపించారు.
ఆ తరువాత వచ్చిన ‘ఆర్య 2’, సుకుమార్‌ను ప్రధానంగా క్యారెక్టరైజేషన్ ఆధారంగా భావోద్వేగాలను నడిపించే వ్యక్తిగా చూపించింది. ఆ తరువాత యువ సామ్రాట్ నాగ చైతన్యతో తెరకెక్కించిన “100% లవ్” సినిమా కూడా సరికొత్త ఉండటంతో యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.ఆ తరువాత ప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘1: నేనొక్కడినే’ సినిమా హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎమోషనల్ గా ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తో తెరకెక్కించిన ‘రంగస్థలం’ కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది .ఈ సినిమాలో రాంచరణ్ లోని సరికొత్త నటుడిని సుకుమార్ బయటకు తీసాడు.ఆ తరువాత వచ్చిన ‘పుష్ప’ చిత్రం గ్లోబల్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.పుష్పతో దర్శకుడు సుకుమార్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు..ఇక త్వరలో రాబోయే పుష్ప 2 చిత్రంతో సుకుమార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .
Also Read
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- Tags
- #film career
- 20 Years
- sukumar
తాజావార్తలు
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?