శర్వానంద్, 14 రీల్స్ మధ్య వివాదంపై నిర్మాతలు స్పందించారని తెలుస్తోంది. సమాచారం మేరకు నిర్మాతలు తాము బకాయిలు చెల్లించబోమని ఎప్పుడూ తేల్చి చెప్పలేదని, కోవిడ్ పరిస్థితి, ప్రాజెక్టు వల్ల కలిగిన నష్టాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నామో శర్వానంద్ కు బాగా తెలుసు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్ కోర్టు నోటీసులు పంపడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే శర్వానంద్ కారణంగానే మూడు నెలల పాటు షూటింగ్ నిలిచిపోయిందని, శర్వానంద్ నటించిన “కో ఆంటే కోటి” చిత్రం కోసం భారీగా పెట్టుబడి పెట్టి, 90% నష్టాలను చవి చూశామని, శర్వానంద్ ఈ నష్టాన్ని భర్తీ చేస్తానని వాగ్దానం చేశాడని, కానీ ఆ తరువాత అసలు ఆ ఊసే ఎత్తలేదని 14 రీల్స్ నిర్మాతలు అన్నట్టు టాక్ నడుస్తోంది.
అసలేం జరిగిందంటే… యంగ్ హీరో శర్వానంద్ నటించిన “శ్రీకారం”సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం తీసుకునేట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట శర్వా. అయితే సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలకు పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇచ్చారట. అయితే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయట. దీంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.