ఈ మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటి వాటిలో ఒకటి 12th ఫెయిల్.. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఓటీటీలోకి వచ్చాక 12th ఫెయిల్ కు మరింత క్రేజ్ వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ అందుకుంది.
అలియాభట్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ మూవీను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.. సినిమా బాగా రావడానికి కారణం వీళ్ల నటనే.. అద్భుతంగా ఉందని సినీ ప్రేమికులు ప్రశంసలు కురిపించారు.. థియేటర్లలో తెలుగు, తమిళం భాషల్లోనూ ఈ మూవీ రిలీజైనా.. ఓటీటీలోకి మాత్రం హిందీ వెర్షన్ మాత్రమే వచ్చింది. దీంతో 12th ఫెయిల్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు తీసుకురావాలంటై డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది రిక్వెస్ట్ చేశారు.. మొత్తానికి ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
నిన్న సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. విక్రాంత్ మాసే తో పాటు మేధా శంకర్, అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చెటర్జీ, గీతా అగర్వాల్ శర్మ, హరీశ్ ఖన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాత గానూ వ్యవహరించారు విధు వినోద్ చోప్రా. శాంతనూ మోయిత్రా స్వరాలు సమకూర్చారు.. ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.. సినిమాను చూడటం మిస్ అయితే ఓటీటీలో చూసి ఆనందించండి..