బుల్లితెరపై ఎన్టీఆర్ మ్యాజిక్… షాకింగ్ టిఆర్పీ

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జెమిని టివి సరికొత్త షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో టెలివిజన్ రంగంలోకి హోస్ట్ గా మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకుముందు పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్”కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసారమైన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కర్టెన్-రైజర్ ఎపిసోడ్‌ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న షోకు చరణ్ ముఖ్య అతిథిగా రావడం అందరిలో ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ షో రేటింగ్‌లు వచ్చాయి. “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. వారంలో ఈ షో సగటు రేటింగ్ 5.6. ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా పని చేయడంతో జెమిని టీవీ 290 జిపిఆర్ నుండి 400 జిపిఆర్ కు వెళ్లింది.

Read Also : ‘మా’ లెక్కలు మారుతున్నాయ్

2014లో “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే పేరుతో ఈ షోను కింగ్ నాగార్జున హోస్ట్ చేసేవారు. ఆ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ కు 9.7 టిఆర్పీని తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్ వెర్షన్ నాగార్జున వెర్షన్ కంటే మెరుగైన రేటింగ్స్ పొందింది. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఊపందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-