‘వకీల్ సాబ్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం కూడా చేయబోతున్నాడట. ఈ వార్త మెగా అభిమానులను మాత్రం హుషారెత్తిస్తోంది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్-2’ చిత్రాలలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘పిఎస్పీకే 28’ సినిమా గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అక్టోబర్లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు చిత్రబృందం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ తెలుగు రీమేక్ తో బిజీగా ఉన్నారు. ఇందులో అతను రానా దగ్గుబాటితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’లో కూడా రానా కనిపించనున్నాడు.