CID Actress Vaishnavi Dhanraj Video Viral: ప్రముఖ హిందీ టీవీ నటి వైష్ణవి ధనరాజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో వైష్ణవి ధనరాజ్ సహాయం కోసం వేడుకోవడం కనిపిస్తుంది. వైష్ణవి ధనరాజ్ ముఖం, శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులు తనను కొట్టారని నటి చెప్పింది. అంతే కాక నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి అంటూ..ఆమె వేడుకుంటుంది. తెలుగులో కూడా బాగా ఫేమస్ సీఐడీ సిరీస్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది వైష్ణవి ధనరజ్. అలాంటి ఆమె తనను కాపాడాలని..తన ఒంటిపై గాయాలను చూపిస్తూ వీడియో చేయడం కలకలం రేపింది. ఈ వీడియోలో వీడియోలో వైష్ణవి ధనరాజ్ తీవ్రంగా గాయపడినట్లు కనిపిస్తోంది.
Bigg Boss Telugu 7 : గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ ఎలిమినేట్ అయింది అతనే?
ఆమె ముఖం మరియు చేతులపై లోతైన గాయాలు కనిపిస్తున్నాయి. నటి తనపై జరిగిన దాడి మొత్తం కథను సోషల్ మీడియాలో వివరించింది, సహాయం కోసం అభిమానులను కూడా విజ్ఞప్తి చేసింది. నేను కాశీమీరా పోలీస్ స్టేషన్‌లో ముంబైలో ఉన్నా, నా కుటుంబమే నాపై వేధింపులకు పాల్పడి, నాతో దారుణంగా వ్యవహరించారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా బంధించారు, నేను తప్పించుకుని బయట పడ్డా అంటూ ఆమె పేర్కొంది. న్యూస్ ఛానల్స్‌తో పాటూ ఇండస్ట్రీ వారు సాయం చేయండి అని ఆమె పేర్కొంది. ఇక ఈ విషయంలో పోలీసులు కూడా స్పందిస్తూ వైష్ణవి ఫిర్యాదు మేరకు తన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైష్ణవి 2016లో నటుడు నితిన్ షెరావత్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుని ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.