Komalee Prasad : ‘హిట్ 3’ దర్శకుడితో ఇబ్బంది పడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతూ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న హీరోయిన్ కోమలి ప్రసాద్. విశాఖపట్నంలో పుట్టిన కోమలి, చిన్నతనం అక్కడే గడిపి, తరువాత కర్ణాటకలోని బల్లారిలో పెరిగింది. ఆమె ఒక ట్రైన్డ్ డాక్టర్ కావడం విశేషం – ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. కానీ సినిమా మీద ఉన్న ఆసక్తి ఆమెను వెండితెరపైకి తీసుకొచ్చింది. అలా 2016లో ‘నేను సీతా దేవి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోమలి, ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా..
Also Read :Bhagyashree : దీపికా, మృణాల్, రష్మిక, జాన్వీ తో పాటు భాగ్యశ్రీ..?
Also Read
‘హిట్ 3’ సిరీస్ లో దర్శకుడు శైలేష్ కొలనాతో తన అనుభవం గురించి చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.. కోమలి మాట్లాడుతూ.. ‘ఆయన సెట్ మీద మాట్లాడే భాషనే నాకు పెద్ద సమస్యగా అనిపించింది. ఆయన తెలుగు అర్థం కాకుండా, విడిగా, విరగగొట్టి మాట్లాడతారు. ఎక్స్ప్రెషన్ లేనట్టే మాట్లాడతారు. మొదట్లో ఆయన స్టైల్ అర్థం కాక ఇబ్బంది పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా సరదాగా చెప్పిన మాటలే కానీ, శైలేష్ ఇచ్చిన అవకాశాలతోనే తాను మంచి విజయం సాధించానని, ఆయనతో పని చేయడం నిజంగా గొప్ప అనుభవమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం కోమలి ‘శశివదనే’ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా పై ఇటీవల పెద్దగా అప్డేట్స్ లేనప్పటికీ, ఈ ముద్దుగుమ్మ బిజీగా నటిస్తూ తన యాక్టింగ్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
తాజావార్తలు
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
-
Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..