Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందుకోనున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా చిరంజీవి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఇక ఈ అవార్డు ప్రకటించించడం పై చిరంజీవి స్పందించారు.
ఇక ఈ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. “కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ గౌరవం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. భారత ప్రభుత్వానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభిమానులందరికి కృతజ్ఞతలు.. మీ వలనే నేను ఇక్కడ ఉన్నాను”అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI— Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022