వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న థియేటర్లోకి వచ్చేసింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో భోళా భాయ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లో భోళా మేనియా నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మెగాభిమానుల సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ ఎంట్రీ, ఖుషి సీన్ వైరల్ అవుతున్నాయి. అయితే భోళా శంకర్‌తో పాటు ఆదిపురుష్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అది కూడా #BholaaShankar #Adipurush #MegastarChiranjeevi అనే ట్యాగ్స్ ట్రెండిగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్లకు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. అందుకే చిరు, ప్రభాస్ మ్యూచువల్ ఫ్యాన్స్ భోళా మేనియాతో పాటు ఆదిపురుష్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
Read Also: Vishal Marriage: అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు.. పెళ్లిపై స్పందించిన విశాల్!
ఉన్నట్టుండి ఆదిపురుష్ ఎందుకు ట్రెండ్ అవుతుందనే డౌట్ రావొచ్చు. దానికి కారణం ఉన్నట్టుండి ఆదిపురుష్ ఓటిటిలోకి రావడమేనని చెప్పొచ్చు. జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా రెండు నెలల్లోపే సైలెంట్‌గా ఓటిటిలోకి వచ్చేసింది. గురువారం మిడ్‌నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండగా హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా భోళా మేనియాతో పాటు ఆదిపురుష్ కూడా ఇప్పుడు టాప్ ట్రెండ్ అవుతోంది.