Vishal Marriage: అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు.. పెళ్లిపై స్పందించిన విశాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Vishal Gives Clarity on Wedding Rumors with Actress Lakshmi Menon: తమిళ స్టార్ హీరో ‘విశాల్’ పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెళ్లి వార్తలపై స్వయంగా విశాల్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తను పూర్తిగా ఖండిస్తున్నాను అని ఓ ట్వీట్ చేశారు.
‘సాధారణంగా నేను సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్ గురించి స్పందించను. అది అనవసరమని నేను భావిస్తాను. అయితే లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి అని వస్తున్న రూమర్స్‌ను ఖండిస్తున్నా. ఇందులో ఏ నిజం లేదు. నెను ఇప్పుడు స్పందించడానికి ఓ కారణం ఉంది. లక్ష్మీ మీనన్ నటిగా కంటే.. ఓ అమ్మాయి. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఆమె ఇమేజ్‌ను కించపరిచారు. సంవత్సరం, తేదీ, సమయం భవిష్యత్తులో నేను ఎవరిని వివాహం చేసుకోబోతున్నాననే విషయాలను డీకోడ్ చేయడానికి ఇది బెర్ముడా ట్రయాంగిల్ కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తా’ అని విశాల్ పేర్కొన్నారు.
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
Also Read: Rohit Sharma: నన్ను, కోహ్లీనే అడుగుతారా?.. ఏం జడేజాను అడగరేం: రోహిత్ శర్మ
ప్రస్తుతం విశాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి తన పెళ్లి వార్తలపై స్పందించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. విశాల్, లక్ష్మీ మీనన్ కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆపై వీరిద్దరూ ఏ సినిమాలోనూ నటించలేదు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంథోని చిత్రంలో నటిస్తున్నారు. ఇది వినాయక చవితికి కానుకగా విడుదల కానుంది.
Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
The reason behind my response is only…
— Vishal (@VishalKOfficial) August 11, 2023
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!