Site icon NTV Telugu

Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!

Chiru

Chiru

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బిజీగా గడుపుతున్నాడు. విశ్వంభరను భారీ పీరియాడికల్ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ను రేపుతోంది. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా జాగ్రత్తలు పడుతోంది. సీన్లు కొన్ని రీ షూట్ కూడా చేశారు. నెగెటివ్ టాక్ మరోసారి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో తాజాగా మూవీ సెట్స్ నుంచి చిరు లుక్ బయటకు వచ్చింది.

Read Also : HHVM : పాన్ ఇండియాలో ‘వీరమల్లు’ సౌండ్ ఏది..?

ఇందులో డైరెక్టర్ వశిష్ట, చిరంజీవి కలిసి ఉన్న పిక్ బయటకు వచ్చింది. వశిష్ట చిరుకు సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడు. ఇందులో బుల్లెట్ బైక్ మీద వశిష్ట ఉండగా.. చిరు పక్కనే నిల్చుని సీన్ వింటున్నాడు. ఇందులో చిరు లుక్ వైరల్ అవుతోంది. చిరంజీవి వింటేజ్ లుక్ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉన్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిరంజీవి ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఏజ్ డిఫరెన్స్ కూడా అస్సలు కనిపించట్లేదు. ఈ లుక్ చూస్తే చిరు వయసు వెనక్కు వస్తుందేమో అన్నట్టు కనిపిస్తున్నాడు. ఇంత యంగ్ లుక్ లో చిరు కనిపించి చాలా రోజులు అవుఓతంది. ఈ సినిమాతో పాటు అనిల్ సినిమాలో కూడా ఇలాంటి లుక్ లోనే కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Akshay Kumar : కన్నప్పలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..?

Exit mobile version