Gharana Mogudu : మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. దానికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవి మ్యానరిజం, స్వాగ్, కామెడీ, మాస్ డైలాగులు.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో లాంటి డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి 1 కోటి 25 లక్షలు తీసుకున్నాడు. అప్పటి వరకు సౌత్ లోనే కాదు ఇండియాలో కూడా ఎవరూ ఇంతగా రెమ్యునరేషన్ తీసుకోలేదు.
Read Also : Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్
1992 ఏప్రిల్ 9న మూవీని రిలీజ్ చేశారు. ఆ టైమ్ లో హిందీలో అమితాబ్ బచ్చన్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు. కానీ అమితాబ్ కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అటు తమిళ హీరోలు కూడా చిరు స్థాయికి దగ్గర్లో లేరు. ఈ మూవీతో రెమ్యునరేషన్ పరంగా రికార్డు సృష్టించాడు చిరంజీవి. ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఇప్పటికీ ఆ మూవీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో నగ్మ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ మూవీతో చిరుకు మాస్ ఇమేజ్ మరింత పెరిగింది. చిరు కెరీర్ లోని కొన్ని మైల్ స్టోన్ లాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు అనే సినిమాల్లో నటిస్తున్నారు. అనిల్ తో చేస్తున్న సినిమా రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
Read Also : Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు