చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించనున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్, కొలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు “ఖైదీ” టైటిల్ అంటే ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “ఖైదీ” సినిమా ఆయనకు స్టార్‌డమ్ తెచ్చిన మైలురాయిగా నిలిచింది. ఇక తమిళ ఆడియెన్స్‌కూ “ఖైదీ” పేరు తక్కువేమీ కాదు. హీరో కార్తీ నటించిన అదే పేరుతో వచ్చిన చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు “ఖైదీలు” ఒకే తెరపై కనిపించబోతున్నారనే రూమర్స్ హాట్‌గా వినిపిస్తున్నాయి. దర్శకుడు బాబీ కొలీ తెరకెక్కించబోతున్న మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కార్తీ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుండగా, ఇందులో చిరంజీవితో పాటు కార్తీకి కూడా పవర్‌ఫుల్ రోల్ ఉంటుందట.
బాబీ ఇప్పటికే “వాల్టేరు వీరయ్య”తో చిరంజీవి ఫ్యాన్స్ హృదయాల్లో తనదైన మార్క్ వేసాడు. ఇప్పుడు ఆయన తెరకెక్కించబోతున్న ఈ కొత్త సినిమా మరింత పెద్ద స్కేల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో తమిళ స్టార్ కార్తీ చేరితే సినిమా పాన్‌ఇండియా లెవెల్‌లో దుమ్మురేపడం ఖాయం. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒక వేలకనుక కార్తీ – చిరంజీవి కాంబినేషన్ నిజమైతే, ఇది సౌత్ సినీ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన కలయికగా నిలుస్తుంది. “ఖైదీ” అనే ట్యాగ్‌తో ఇద్దరూ తెరపై కలిసే రోజుకై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.