Site icon NTV Telugu

Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి దీపావళి పోస్టర్

Chiru

Chiru

Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటోందని చెప్పుకోవాలి కాబోలు.

Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ నోట బలూచిస్థాన్.. నెట్టింట ఒకటే రచ్చ

ఈ పోస్టర్ లో చిరంజీవి సైకిల్ తొక్కుతున్నారు. ఇందులో ఆయన పక్కన ఇద్దరు చిన్నారులు కూడా సైకిల్ తొక్కుతున్నారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే వారిద్దరూ ఇందులో చిరు పిల్లలుగా నటిస్తున్నారేమో అని అంటున్నారు. చిరంజీవి ఇందులో ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడేమో అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి రిచ్ మ్యాన్ గా.. ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నట్టు ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ ను బట్టి అర్థం అవుతోంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో వస్తోంది.

Read Also : Bigg Boss 9 : నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే.. లవ్ ట్రాక్స్ కోసమే వచ్చావా రీతూ..

Exit mobile version