Abhilasha: 40 యేళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ తో….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhilasha: చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘అభిలాష’ విడుదలై, చూస్తుండగానే నలభై యేళ్ళు గడిచిపోయింది. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో విద్య ప్రాధాన్యతను తెలియచేస్తూ ఓ సినిమా రాబోతోంది. మనిషి చైతన్యానికే కాదు… సమాజ చైతన్యానికి, అభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుంది. అలాంటి విద్య ప్రాముఖ్యతను తెలియచేస్తూ, సి.హెచ్. శిరీష ‘అభిలాష’ సినిమా నిర్మించారు. అమర్ దీప్ హీరోగా, అశ్విని రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శివప్రసాద్ చలువాది దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ప్రముఖ నటుడు పృథ్వి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. ట్రైలర్ చాలా బావుంది. ఓ మంచి పాయింట్ తో ఈ సినిమాను తీయడం సంతోషం” అని అన్నారు.
దర్శకుడు శివప్రసాద్ చలువాది మాట్లాడుతూ, “అసభ్యతకు తావులేకుండా నవరసాల్లోని అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను తీశాం. 1983లో వచ్చిన చిరంజీవి గారి ‘అభిలాష’ చిత్రానికి, ఈ సినిమాకు కథాపరంగా ఎలాంటి సంబంధం లేదు. ఆ చిత్రంలో ఉరి రద్దు చేయాలని చూపిస్తే, ఇందులో చదువు వద్దన్న విలన్ ను హీరో ఎలా ఎదుర్కోవడం జరిగిందన్న అంశాన్ని చూపించాం” అని చెప్పారు. నిర్మాత సి.హెచ్. శిరీష మాట్లాడుతూ, పాత్రలకు సరిపోయే మంచి ఆర్టిస్టులను ఎంపికచేసుకునిఈ చిత్రాన్ని తీశామని అన్నారు. ఇటీవల వచ్చిన చిన్న చిత్రం ‘బలగం’ తరహాలోనే ఈ సినిమా కూడా విజయవంతం కావాలనే ఆకాంక్షను సీనియర్ నటులు అశోక్ కుమార్, సమ్మెట గాంధీ వ్యక్తం చేశారు. తమ కెరీర్ కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని హీరో అమర్ దీప్, హీరోయిన్ అశ్విని రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు బెల్లంకొండ వెంకట్, ఐడ్రీమ్ అంజలి, జబర్దస్త్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కుమార్, ఫైట్ మాస్టర్ నభా, గీత రచయిత తిరుపతి, స్క్రీన్ ప్లే రచయిత పాండు చరణ్, సహనిర్మాత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
తాజావార్తలు
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!