Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కనకరత్నమ్మ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన అత్తయ్య కనకరత్నమ్మ కళ్లను దానం చేసినట్టు ప్రకటించారు చిరంజీవి. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో నాకు మా అమ్మగారికి, మా అత్తయ్య గారికి మధ్య ఓ విషయం గురించి చర్చ జరిగింది.
Read Also : Balakrishna : బాలయ్య మంచి మనసు.. వరద బాధితులకు రూ.50 లక్షలు
మీ కళ్లను దానం చేస్తారా అని నేను మా అత్తయ్య గారిని అడిగాను. అప్పుడు ఆమె కాలి బూడిదయ్యే శరీరానికి ఏముంది నాయనా.. ఇచ్చేస్తాను అన్నారు. ఇదే విషయాన్ని నేను ఈ రోజు అరవింద్ ను అడిగితే.. వెంటనే ఒప్పుకున్నారు. అందుకే ఈ రోజు ఉదయమే నేను ఆమె కళ్లను హాస్పిటల్ కు అప్పగించాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూపించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, అల్లు అరవింద్ చేసిన మంచి పనికి అంతా ప్రశంసిస్తున్నారు.
Read Also : Mirai : మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే