Anil Ravipudi : బ్లాక్ బస్టరిచ్చిన రావిపూడికి మెగాస్టార్ కళ్ళు చెదిరే ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం ‘మెగా’ హవా నడుస్తోంది, సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, విమర్శకుల ప్రశంసలతో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో వినోదాన్ని పంచి, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ‘బ్లాక్ బస్టర్’ను తన ఖాతాలో వేసుకున్నారు, ఈ హిట్ తో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోతుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక క్రేజీ ఇంటర్వ్యూను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది, ఈ సందర్భంగా చిరంజీవి ఒక సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడికి ఆయన ఒక ‘మెగా ఆఫర్’ ఇచ్చారు.
Also Read: Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
Also Read
- Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. 'పెద్ది'కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
- Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
- Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
- Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
“అనిల్.. నాకు, వెంకటేష్‌కి కలిపి ఒక మంచి స్క్రిప్ట్ సిద్ధం చెయ్, మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి సిద్ధం” అని చిరంజీవి ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ వెంకటేష్ సినిమాలో తనకు గెస్ట్ రోల్ ఇచ్చినా సరే, నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చిరంజీవి పెద్ద మనసుతో చెప్పారు, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న ఫుల్ లెంగ్త్ కథను రాసుకురమ్మని అనిల్‌కు సూచించారు. సినిమా ఎప్పుడు చేద్దామన్నా తాను సిద్ధమేనని, వెంటనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టమని అనిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి ఆఫర్‌పై విక్టరీ వెంకటేష్ కూడా ఎంతో ఉత్సాహం చూపించారు, “ఖచ్చితంగా చేద్దాం” అంటూ ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ‘మెగా బోనస్’ గా అభివర్ణించారు. ఇప్పటికే ‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న అనిల్, ఈ ఇద్దరు దిగ్గజ హీరోల కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తారో అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
-
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!