Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Nidimoru : భారతీయ సినిమాల్లో కొన్ని పేర్లు నటులుగా మాత్రమే ఉండవు. కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది హీరోలు సినిమాలో ఆయన కటౌట్ పెట్టి కలెక్షన్లు కురపించుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి ప్రభావం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా ఆయన పేరు, పాటలు, రిఫరెన్స్‌లు కనిపించడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది.
చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రాజ్ నిడిమోరు ప్రధానంగా బాలీవుడ్లోనే తన సినిమాటిక్ ప్రయాణం సాగిస్తున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా, దర్శకుడిగా ఆయన చేసిన కృషి అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన స్నేహితుడు డీకే (కృష్ణ డీ.కే.)తో కలిసి రాజ్ నిడిమోరు అనేక సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అందించారు.ఈ జోడీ తమ రచనల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు, పాటలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం గమనార్హం.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు ఈ విషయంపై మాట్లాడుతూ,’గన్స్ అండ్ గులాబ్స్’లోనూ, ‘గో గోవా గాన్’ లోనూ చిరంజీవి గారి పాటలు ఉపయోగించాం. మా విజయంలో అవి కూడా కీలక పాత్ర పోషించాయి. ‘గన్స్ అండ్ గులాబ్స్’ లో ఉత్తర భారతదేశంలో హోటల్ నడుపుతున్న తెలుగు వ్యక్తి ‘ఆత్మారాం’ అనే పాత్రను చూపించాం. కేవలం హిందీ మాత్రమే కాకుండా పాత్రలు తమ సొంత భాషలో మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్నాం అని చెబుతూ చిరంజీవి పాపులారిటీ ఏపాటిదో చెప్పారు.
ఆయన మరింత వివరిస్తూ, భారతదేశం నలుమూలల నుంచి నటులను తీసుకోవాలని, వాళ్లు తమ మాతృభాషలోనే మాట్లాడేలా అవకాశం ఇవ్వాలని భావించాం. ఇది మాకు దేశవ్యాప్తంగా టాలెంట్‌ను ఎంపిక చేసుకోవడానికి ఉపయోగపడింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో ‘సినిమా బండి’ కనెక్షన్ ఇచ్చాం. అది మా మాతృభాషకు ఇచ్చిన ఒక చిన్న ట్రిబ్యూట్ అని అన్నారు. రాజ్ నిడిమోరు – డీకే జోడీ తమ కథల్లో దక్షిణ భారత సంస్కృతి, సినిమా సంప్రదాయాలను ఇమడ్చడం ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. చిత్తూరు నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణించిన రాజ్, తన గుర్తింపును, మాతృభాష పట్ల ఉన్న ప్రేమను, చరంజీవిపై ఉన్న అభిమానాన్ని ఇలా తన మాటల్లో చెప్పుకొచ్చారు.
- Tags
- cinema
- Raj Nidimoru
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!