మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా, సంక్రాంతి విన్నర్‌గా కలెక్షన్లు సాధిస్తూ సూపర్ మౌత్ టాక్‌తో దూసుకు వెళ్తోంది. అయినా సరే ప్రమోషన్స్‌లో ఏమాత్రం తగ్గకుండా.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో కలిపి అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూ షూట్ చేసి, ఈరోజు మీడియాకి రిలీజ్ చేశారు.
Also Read:Anil Sunkara: సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి..మా సినిమా మరీ బాగుంది!
ఇక ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలో ఒకచోట మెగాస్టార్ మోస్ట్ ట్రోల్డ్ “ఇందువదన కుందరదన.. వావ్!” అంటూ, ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటను ఆయన చేత పలికించి అందరినీ నవ్వించారు. అయితే ఈ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన విషయాన్ని పంచుకుంటూ, అనిల్ రావిపూడి తనకు ఎలా చెప్పారో ఆ విషయాన్ని మెగాస్టార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
Also Read:Anil Ravipudi : బ్లాక్ బస్టరిచ్చిన రావిపూడికి మెగాస్టార్ కళ్ళు చెదిరే ఆఫర్!
“మీరు ఇక్కడ పులిని చూసి భయపడతారు.. అప్పుడు ఇందువదన కుందరదన వావ్ అనమన్నారు. కానీ సంబంధం లేకుండా ఆ డైలాగ్ అనడం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. వెంటనే అనిల్‌ని అడిగితే.. ఇది మీమ్స్‌లో బాగా వైరల్ అయింది, మీరు పలికితే బాగుంటుంది, ఆ మీమ్స్ అన్నింటికీ, ట్రోల్స్ అన్నింటికీ మీరే చెక్ పెట్టినట్టు ఉంటుంది అన్నాడు. సరేనని అనేశాను” అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. వెంటనే అనిల్ కల్పించుకుని, “మీరు వావ్ అన్నారు.. సినిమా బ్లాక్ బస్టర్ అయింది” అంటూ చెప్పుకొచ్చాడు.