మెగాస్టార్ చిరంజీవి జన జాగృతి పార్టీలో కీలక పాత్రపోషించబోతున్నారు. అదేంటి ఆయన రాజకీయాల్లో లేరు కదా? అనే డౌట్ రావచ్చు. నిజమే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపై దృష్టి పెట్టారు. రీ-ఎంట్రీలో ‘ఖైదీనెం.150’తో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ‘సైరా’తో సక్సెస్ ను కంటిన్యూ చేశారు. తాజాగా ‘ఆచార్య’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
ఇదిలా ఉంటే తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో రాజకీయాలను శాసింసే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సపోర్ట్ చేసే పార్టీ పేరే ‘జన జాగృతి’. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి ఇది రీమేక్. మోహన్ లాల్ పోషించిన పాత్రనే ఇప్పుడు చిరంజీవి పోషిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ‘జన జాగృతి’ అనేది చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ‘జన సేన’కి దగ్గరగా వినిపిస్తోంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. సినిమాలో ఈ పార్టీ ప్రస్తావన, ప్రస్థానం ‘జన సేన’ పార్టీ నియమావళికి దగ్గరగా ఉండవచ్చని సమాచారం. మరి ఈ సినిమా విడుదల తర్వాత పవన్ పార్టీకి మరింత ఊపు వస్తుందేమో చూడాలి.