Chiru Balayya: 2017 హిస్టరీ రిపీట్ అవుద్దీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ రేంజులో ఉంటుంది? ఇలాంటి భీభత్సాన్ని సృష్టించడానికే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరు బాలయ్యలు రెడీ అయ్యారు. మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాని ముందుండి నడిపిస్తున్న ఈ ఇద్దరికీ రాక్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. చిరు, బాలయ్యలు విడివిడిగా వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. అదే ఇద్దరూ ఒకే సీజన్ లో తలపడితే బాక్సాఫీస్ దగ్గర ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
2023 సంక్రాంతికి జరగబోతున్న బాక్సాఫీస్ వార్ కి సాంపిల్ ఎలా ఉంటుందో చిరు, బాలకృష్ణలు 2017లోనే చూపించారు. రాజకీయల నుంచి చిరు మళ్లీ సినిమాల్లోకి వచ్చిన సంవత్సరం 2017. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి చిరు తిరిగోస్తున్నాడు అనగానే మెగా అభిమానులే కాదు యావత్ తెలుగు సినీ అభిమానులు ఖుషీ అయ్యారు. మెగాస్టార్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడా అని వెయిట్ చేశారు. పదేళ్ల గ్యాప్ ని పక్కకినెడుతూ, తనలో హీరోయిజం ఇంకా అలానే ఉందని నిరూపిస్తూ చిరు ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చేశాడు. వినాయక డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2017 జనవరి 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. చిరు కంబ్యాక్ ని ఎంజాయ్ చేద్దామని మెగా అభిమానులు ప్లాన్ చేసుకునే సమయానికి, బాలయ్య రంగంలోకి దిగుతూ సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో జనవరి 12న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాని రిలీజ్ చేశాడు. చిరు కంబ్యాక్ కావడంతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తన 100వ సినిమాని సేఫ్ జోన్ లో చెయ్యకుండా పీరియాడిక్ వార్ డ్రామాకి చేసిన బాలయ్య లాంగ్ రన్ లో నిలిచాడు. ఈ మూవీలో బాలయ్య డైలాగ్స్ కి నందమూరి అభిమానులు థియేటర్స్ టాప్ లేపారు. ఓవరాల్ గా చిరు బాలయ్యలు ఒక్క రోజు గ్యాప్ తో వచ్చి బాక్సాఫీస్ ర్యాంపేజ్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. యంగ్ హీరోలకి కూడా అంతటి రిపీట్ ఆడియన్స్ ఉంటారా అని షాక్ ఇచ్చే రేంజులో చిరు, బాలయ్యల హంగామా సాగింది.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
చిరు కంబ్యాక్ అవ్వడం, బాలయ్య ప్రయోగం చెయ్యడంతో 2017 సంక్రాంతికి జరిగింది శాంపిల్ మాత్రమే. ఈసారి పరిస్థితి ఇలా లేదు… 2023 సంక్రాంతికి చిరు మాస్ గెటప్ లో ‘వాల్తేరు వీరయ్య’గా వస్తుంటే, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలయ్య తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ ప్లే చేశాడు. అంటే చిరు, బాలయ్యలు తమ బలాన్ని నమ్ముకోని చేస్తున్న సినిమాలతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారన్నమాట. అయితే 2017కి 2023కి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు చిరు ఒక్కరోజు ముందొస్తే, ఇప్పుడు బాలయ్య ఒక్కరోజు ముందొస్తున్నాడు. చిరు హిట్ కొడతాడని మెగా ఫాన్స్ అంటుంటే కాదు బాలయ్య హిట్ కొడతాడని నందమూరి ఫాన్స్ అంటున్నారు. అలా కాదు అసలు ఈ ఇద్దరూ కలిసి రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి 2023 కి గ్రాండ్ వెల్కం చెప్పేస్తే అప్పుడు వస్తుంది సంక్రాంతి పండగకి అసలు ఊపు. ఇంట్లో కూర్చున్న వాళ్లు కూడా ఫ్యామిలీతో సహా వచ్చి సినిమా చూస్తారు, అది అసలైన పండగ అంటే. మరి… చిరు, బాలయ్యలు ఇద్దరూ సాలిడ్ హిట్ కొట్టి 2017 హిస్టరీ రిపీట్ చేస్తారేమో చూద్దాం.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!