మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక అందులో ఒకటి భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శహకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. కోలీవుడ్ హిట్ సినిమా వేదాళం సినిరంకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కనిపించనున్నాడట. అందుకే ఈ చిత్రంలో ఖుషీ చిత్రంలోని నడుము సీన్ ను రీపీట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
పవన్ గా చిరు, భూమిక గా శ్రీముఖి నటిస్తున్నారట.. ఈ రీక్రియేషన్ సీన్ నవ్వులు పూయిస్తుందని టాక్ నడుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ విషయం విన్నాకా పవన్ అభిమానులు మెహర్ రమేష్ ను ఏకిపారేస్తున్నారు. బంగారంలాంటి సీన్ ను పాడు చేస్తే మాములుగా ఉండదని కొందరు.. నువ్వు తీసేదే రీమేక్ సినిమా దాన్ని అటు ఇటు టిఇపి తీసినా పర్లేదు కానీ పవన్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యేలా చేస్తే మాత్రం బాగోదని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుతుందో చూడాలి.