Peddi : బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మొన్న చికిరి సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ గ్రేస్ గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే దీని వెనకాల చిరంజీవి ఉన్నాడంట. గ్రేస్ ఉండే డ్యాన్స్ చేయక చాలారోజులు అవుతోందని.. ఈ సినిమాలో కచ్చితంగా దాన్ని చేయాలని చిరంజీవి ఆర్డర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మనకు తెలిసిందే కదా.. చిరంజీవి అంటనే డ్యాన్స్ కు టాలీవుడ్ లో క్రేజ్ తీసుకొచ్చిన హీరో అని.
Read Also : Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
అలాంటి చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్.. మళ్లీ డ్యాన్స్ తో ఊపేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ లో పెద్దగా స్టెప్పులు లేవు. కాబట్టి పాత గ్రేస్ ను మరోసారి తెరమీద చూపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని చిరంజీవి సూచించారంట. అందుకే చికిరి సాంగ్ లో మాస్ గ్రేస్ ఉండే స్టెప్పులతో పాటు.. చాలా స్టైలిస్ అండ్ మాస్ వేరియంట్స్ లో చరణ్ డ్యాన్స్ కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. చరణ్ నుంచి తాము కోరుకున్నది ఇలాంటి స్టెప్పులే అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.
Read Also : SSMB 29 : సమయం ఆసన్నమైంది.. ఫ్యాన్స్ కు మహేశ్ బాబు స్పెషల్ వీడియో
