దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. స్పెషల్ ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు అంటూ భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా కోసం రెండు భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తుండగా, అందులో ఒకరు దుబాయ్ లో, రెండు కర్ణాటకలో జరగనున్నాయని అంటున్నారు. ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ దృష్టి సారించారు.
Read also : The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్
మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో RRR ప్రమోషన్స్ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి రంగంలోకి దిగబోతున్నారని బజ్. RRR ఈవెంట్ కు కర్ణాటక సీఎంతో పాటు హెల్త్ మినిష్టర్, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ భారీ ఈవెంట్ ను దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు అంకింతం ఇవ్వబోతున్నారట RRR టీం. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.