Karthik Ratnam: క్రైమ్ కామెడీగా ‘ఛాంగురే బంగారు రాజా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ ఇటీవల తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఆర్. టి. టీమ్‌వర్క్స్‌ను ప్రారంభించారు. ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్, కొత్త నటీనటులను ప్రోత్సహించడానికి కంటెంట్ ప్రాధాన్యత గల చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 4గా ‘ఛాంగురే బంగారురాజా’ అనే కొత్త చిత్రం రూపొందుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ చిత్రాలలో కీలకపాత్ర పోషించిన కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కుషిత కల్లపు కథానాయికగా కనిపించనుంది. సత్య అక్కల, రవిబాబు ఇతర ముఖ్య తారాగణం. ఈ మూవీ టైటిల్ ‘ఛాంగురే బంగారురాజా’ను ‘శ్రీ కృష్ణ పాండవీయం’లోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు. టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.
Also Read
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?


‘ఛాంగురే బంగారురాజా’ చిత్రం గురువారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. సుందర్ ఎన్. సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నారు.
తాజావార్తలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!