Chandramukhi 2: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చిత్రం చంద్రముఖి 2. దాదాపు పదేళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచో మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వాగతాంజలి .. అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రాజనర్తకి చంద్రముఖిగా కంగనా అందం, అభినయం అదరహో అనిపిస్తోంది. చంద్రముఖిలోని రారా.. సరసకు రా సాంగ్ ట్యూన్ లోనే ఈ పాట కూడా ఉండడం విశేషం.
Nani: ఛీఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ అని రాజమౌళిని అనేసింది
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల అద్భుతంగా ఆలపించింది. ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నా.. రాఘవ లారెన్స్ లుక్ మాత్రం కొద్దిగా తేడాగా ఉందని అంటున్నారు. వెంకటపతి రాజావారుగా లారెన్స్ సెట్ అవుతాడా.. ? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు. దీంతో ఆయన నటనతో ఫిదా చేసే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. చంద్రముఖి 2 ను వినాయక చవితికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కంగనా, లారెన్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.