నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు.…