Chandini Chowdary Interview for Gaami Movie:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. . విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలు పంచుకున్నారు.
‘గామి’ ప్రాజెక్ట్ లో ఎప్పుడు చేరారు ?
గామి ప్రాజెక్ట్ లో మొదటి రోజు నుంచి వున్నాను. మను సినిమా చేసినపుడు దర్శకుడు విద్యాధర్ గారు పరిచమయ్యారు, గామి అంటే గోల్ సీకర్.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లోకేషన్స్ లో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరీంచాం. మా టీంలో నేను ఒక్కరే అమ్మాయిని. అందరూ ఒక బస్సులో వెళ్లి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. షూటింగ్ లో చాలా సవాల్ తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగే దాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం. ఇందులో చూపించిన స్టంట్స్ రియల్ గా చేశాం, గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయి. పొరపాటున కింద పడితే ప్రాణానికే ముప్పు. ఇలాంటి సమయంలో నా దగ్గర ఉన్న లగేజ్ ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డాను. ఈ సినిమా ప్రయాణం అంతా ఒక సాహస యాత్రలా జరిగింది.
గామి విన్నప్పుడే ఈ సినిమా ఐదేళ్ళు పడుతుందని అనుకున్నారా ?
గామికి సమయం పడుతుందని తెలుసు, ఎందుకంటే చెప్పే కథ పెద్ద కాన్వాస్ లో వుంది. మేము లిమిటెడ్ క్రూ తో వెళ్లాం, పైగా దర్శకుడు విద్యాధర్ క్రాఫ్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. తను అనుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తారు. చాలా డిఫరెంట్ వాతావరణ పరిస్థితిలలో తీసిన సినిమా ఇది. దీనివల్ల తప్పకుండా సమయం పడుతుంది. అంత సమయం తీసుకున్నాం కాబట్టి విజువల్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమాక్స్ స్క్రీన్ లో ట్రైలర్ చూసినప్పుడు పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.
గామిలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
ఇందులో నాది, విశ్వక్ పాత్రల కథలు ఒకదానితో ఒకటి మెర్జ్ అయ్యే వుంటాయి. ఎలా మర్జ్ అవుతాయనే తెరపై చూడాలి. గామి క్లైమాక్స్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని నమ్మకం వుంది. గామి లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు. గామి లాంటి సినిమా వర్క్ అవుట్ అయితే ఇంలాంటి మరిన్ని అద్భుతమైన కథలు వస్తాయి.
పరిశ్రమలో ఈ పదేళ్ళ ప్రయాణం ఎలా అనిపించింది ?
పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా అన్ బిలివబుల్, పరిశ్రమలోకి వచ్చినపుడు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ ఆపకుండా ఏదో ఒకటి చేయాలి. కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు నచ్చింది చేయాలి. కొన్నిసార్లు ఆప్షన్ ఉండదు. అప్పుడు ఉన్నది చేయాలి. ఏదేమైనా పని చేస్తూనే ఉండాలి. పదేళ్లు పూర్తి చేసుకోవడం నా దృష్టి చాలా పెద్ద డీల్.