Majili: ఇదే రోజున నాలుగేళ్ల క్రితం సామ్-చై భార్యాభర్తలుగా సెన్సేషనల్ హిట్ కొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో స్టార్టింగ్ హీరో-హీరోయిన్ కలవడం, ఈ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం, హ్యాపీగా ఉండడం, పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథలు ఎండ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రేమకథా సినిమాల్లో ఉండే సింగల్ లైన్ కథ ఇదే. అచ్చం ఇలాంటి కథనే నిజ జీవితంలో ఫేస్ చేశారు అక్కినేని నాగ చైతన్య, సమంతా. ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత గ్రాండ్ గా సమంతా-నాగ చైతన్య పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లవ్ స్టొరీకి పెళ్లి అనేది హ్యాపీ ఎండింగ్ అని అంతా అనుకున్నారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఓపెన్ అయ్యి సినిమా మొత్తం మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్-చైతన్యలు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోయారు. ఎవరూ ఊహించని ఈ విషయం సినిమాని మించిన ట్విస్ట్ అనే చెప్పాలి.
ఈ ఇద్దరి కథతో ఒక సినిమా చేస్తే అది లవ్ స్టొరీజానర్ లో వచ్చిన బెస్ట్ సినిమా అవుతుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సమంతా, నాగ చైతన్య కలిసి చేసిన ఒకేఒక్క సినిమా ‘మజిలి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో సమంతా కనిపిస్తుంది. చై-సామ్ ఆన్ స్క్రీన్ కలిసి కనిపిస్తే థియేటర్స్ లో ఫాన్స్ రచ్చ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగేళ్ళు అయ్యింది. మజిలి సినిమాలో ఎన్ని మలుపులు ఉన్నా సినిమా కాబట్టి చివరికి హ్యాపీ ఎండింగ్ వచ్చింది. రియల్ లైఫ్ లో ఆల్టర్నేట్ ఎండింగ్ వచ్చింది. మజిలి లాంటి సినిమా ఇంకొకటి వస్తుందో లేదో తెలియదు కానీ సామ్-చై కలిసి నటిస్తే చూడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. విడిపోయిన తర్వాత చై-సామ్ ని కలిపి సినిమా చేసే ఆలోచన ఎవరికీ వస్తుందో తెలియదు కానీ ఆ ఆలోచన ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టేసినట్లే అవుతుంది. మరి చై-సామ్ ని కలిపి సినిమా ఎవరు చేస్తారో చూడాలి.
Also Read
- Kanchana 4: కాంచన - 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
- Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్... "ధమాల్ 4" ట్రైలర్ మామూలుగా లేదుగా
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
- Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
-
Kanchana 4: కాంచన – 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
-
Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
-
RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!