సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023కి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. 8 టీమ్స్ మధ్య జరిగే 19 మ్యాచుల ఈ సీజన్ ఫిబ్రవరి 18న మొదలయ్యింది. తెలుగు వారియర్స్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఫామ్ లో ఉంది. ఈరోజున తెలుగు వారియర్స్ vs పంజాబ్ దే షేర్ టీమ్స్ కి మధ్య మ్యాచ్ జరుగుతుంది. CCL 2023 సీజన్ 9వ మ్యాచ్ గా జరుగుతున్న ఈ గేమ్ లో హాట్ ఫేవరేట్స్ గా తెలుగు వారియర్స్ గ్రౌండ్ లోకి దిగుతున్నారు. మరి వైపు సోను సూద్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్ టీమ్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి ఈ మ్యాచ్ గెలవాలనే కసితో ఉంది. సోను సూద్ టీమ్ కి నైట్ మేర్స్ లా అఖిల్, ఆదర్శ్, అశ్విన్ బాబులు కనిపిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ నుంచి అఖిల్ అక్కినేని, ప్రిన్స్ ఓపెనర్స్ గా గ్రీసులోకి వచ్చారు.