‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సస్ అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ వచ్చినా కూడా ‘హిట్ 2’ మొదటిరోజు 11 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ‘హిట్ 2’ మూవీ అడవి శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తోంది. ఈ రెండు గంటల థ్రిల్లర్ మూవీ ఫస్ట్ సండే కూడా మంచి ఫుట్ ఫాల్స్ ని రాబట్టింది. అయితే టాక్ యావరేజ్ గా ఉండడంతో, ‘హిట్ 2’ సినిమా ఫస్ట్ మండే టెస్ట్ ని పాసవుతుందా? లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. అడవి శేష్ కోసం, ప్రమోషన్స్ చేసిన విధానం కలిసొచ్చి ‘హిట్ 2’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఈ మూవీకి లాంగ్ రన్ ఉండాలి అంటే ‘మండే టెస్ట్’ని పాస్ అవ్వాల్సిందే.
ప్రస్తుతం ఉన్న టాక్ ని బట్టి చూస్తుంటే ‘హిట్ 2’ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో సస్పెన్స్ అనుకున్న రెండు విషయాలని ఆడియన్స్ లీక్ చేయడంతో ‘హిట్ 2’ సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వలేకపోతున్నారు అనేది నిజం. యాక్టర్ సుహాస్ ని విలన్ అనే విషయాన్ని కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అతను కిల్లర్ ఏంటి? ఇతని కోసం ఇంత చేయాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘హిట్2’ క్లైమాక్స్ లో కూడా ‘హిట్ 3’కి లీడ్ ఇస్తూ ‘నాని’ని ‘అర్జున్ సర్కార్’గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సర్ప్రైజ్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ‘హిట్ 2’ సినిమాకి ప్రధాన బలాలైన రెండు విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమాని థియేటర్స్ కి వచ్చి చూసే ఆడియన్స్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ మండే టెస్ట్ ని ‘హిట్ 2’ పాస్ అయితే నెక్స్ట్ ఫ్రైడే వరకూ అడవి శేష్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటి.