విడుదలైన తొమ్మిది వారాల తరువాత ఎట్టకేలకు మొదటి స్టానాన్ని విడిచి పెట్టింది ‘బట్టర్’ సాంగ్. బీటీఎస్ బాయ్స్ రిలీజ్ చేసిన 2021 సెన్సేషన్ ‘బట్టర్’ పాట బిల్ బోర్డ్ లో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక కాలం నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న పాప్ నంబర్ నైన్ వీక్స్ తరువాత ఫోర్ట్ ప్లేస్ కి పడిపోయింది. ద కిడ్ లారోయ్, జస్టిన్ బీబర్ స్టే టాప్ పొజీషన్ ని ఆక్రమించగలిగాయి. అలాగే, ఒలివియా రోడ్రిగో ‘గుడ్ 4 యు’ సాంగ్ రెండో స్థానంలో సత్తా చాటుతోంది. ఇక దువా లిపా పాడిన ‘లెవిటేటింగ్’ బిల్ బోర్డ్ టాప్ 100లో మూడో స్థానం సంపాదించగలిగింది. నాలుగో స్థానంలో ప్రస్తుతం ‘బట్టర్’ కొనసాగుతోంది…
‘బట్టర్’ నాలుగో స్థానానికి పడిపోయినా ఇంకా హాట్ ఫేవరెట్ గానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులు ‘బట్టర్’ను మళ్లీ మళ్లీ రుచి చూస్తూనే ఉన్నారు. తొమ్మిది వారాల పాటూ బిల్ బోర్డ్ 100 లిస్ట్ లో టాప్ వన్ గా ఉండటం మామూలు విషయం కాదు. గత తొమ్మిది వారాల్లో ఎన్నో రికార్డుల్ని బీటీఎస్ పాప్ నంబర్ బద్ధలు కొట్టేసింది. ‘బట్టర్’ తరువాతి స్థానంలో టాప్ ఫిఫ్త్ సాంగ్ గా ఎడ్ షీరన్ ఆలపించిన సింగిల్ ‘బ్యాడ్ హ్యాబిట్స్’ శ్రోతల్ని మైమరిపిస్తోంది…