సినిమా ఇండస్ట్రీ ఎవరి కెరీర్ ను ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ కష్టం ఎంత అవసరమో.. లక్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి అదృష్టాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. కేవలం రూ.45 కి ఆర్య సినిమాను కొని ఇప్పుడు ఏకంగా వంద కోట్లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. ఆ నిర్మాత మీరెవరో కాదు బన్నీవాసు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ వాసు అనే పేరు తెలియని వారు ఎవరు లేరు. ముఖ్యంగా మెగా, అల్లు ఫ్యామిలీలకు చాలా క్లోజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్. ఆయనంటే అల్లు అర్జున్ కి కూడా చాలా ఇష్టం. అందుకే తన పేరులో బన్నీని యాడ్ చేసుకున్నాడు.
Also Read : Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !
ఈమధ్య కాలంలో బన్నీ వాసు నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. లిటిల్ హార్ట్స్, మహావీర్ నరసింహా, రీసెంట్ గా కాంతార: చాఫ్టర్ 1. వరుసగా సూపర్ హిట్స్ అందుకున్ని సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలిచాడు. ఇందులో భాగంగానే, తాజాగా ఆయన నుంచి వస్తున్న సినిమా ‘మిత్ర మండలి’. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో బాగంగా ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఇందులో బన్నీ వాసు తన సినిమా ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
అయితే యాంకర్ మీ కెరీర్లో మీకు బాగా కిక్ ఇచ్చిన సినిమా ఏంటి అని ప్రశ్నించగా.. ‘నాకు గుర్తుంది పోయే సినిమా అంటే ఆర్య. దాని తర్వాత నేను నిజంగా ఎంజాయ్ చేసింది మాత్రం పోకిరి.. ఆ సినిమా బాగా ఎంజాయ్ చేసా , అరుంధతి కూడా.. ఇవ్వని ఒకెత్తు అయితే ఒక డిస్టిబుషర్ గా నాకు కిక్ ఇచ్చింది మాత్రం మగధీర మూవీ’ అని తెలిపారు.