Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం ట్రైలర్ రిలీజ్ చేసిన నిముషాల్లోనే చాలా మంది ఆ వీడియోను రకరకాలుగా ట్రోల్స్ చేయడం చూసి షాక్ అనిపించింది. మరీ ఇంత నెగెటివిటీ ఎందుకు అనిపించింది.
Read Also : Hrithik Roshan : హృతిక్ రోషన్ కు హైకోర్టులో ఊరట..
కేవలం ట్రోలర్స్ మాత్రమే కాదు.. ఒక సినిమాను రకరకాల రివ్యూలతో మనమే చంపేసుకుంటున్నాం. బుక్ మై షో కూడా తన అఫీషియల్ వెబ్ సైట్ లో రివ్యూలు, రేటింగుల పేరుతో కాంపిటీషన్ పెడుతోంది. దీన్ని వాళ్లు ఆపేసుకోవాలి. ఎందుకుంటే బుక్ మై షోకు ప్రేక్షకులు వెళ్లేదే టికెట్లు బుక్ చేసుకోవడానికి. అలాంటప్పుడు అక్కడ రేటింగుల పేరుతో కాంపిటీషన్ పెడితే సినిమాకు ఆదరణ తగ్గుతుంది. చూడాలనుకునే వారికి ఆ రేటింగ్స్ చూసి ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాబట్టి ఈ విషయంలో వాళ్లు మారాలి అంటూ తెలిపారు బన్నీ వాసు.
Read Also : Mithramandali : అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్