krithi shetty : కృతికి మరో బంపర్ ఆఫర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి ఏ ముహూర్తన హీరోయిన్‌గా అడుగుపెట్టిందో గానీ.. వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. తన క్యూట్‌నెస్‌తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ్‌లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా కృతికి మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. దాంతో కృతి అక్కడ సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టేసిందని అంటున్నారు. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతోంది..?
Also Read
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి టైం నడుస్తోంది. ఉప్పెన సినిమాతో ఆకట్టకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఆఫర్స్ అందుకుంటోంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. దాంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్లు సైతం ఈర్షపడేలా భారీ ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. నితిన్ జంటగా ‘మాచర్ల నియోజికవర్గం’.. రామ్ పోతినేని జోడిగా ‘ది వారియర్’ అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలను ఆమె హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక తమిళ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ చిన్నది. విలక్షణ దర్శకుడు బాలా-స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాతో.. కృతిశెట్టి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఇప్పుడు హీరో ధనుష్ సరసన కూడా.. కృతి ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ముందుగా ప్రియాంకా అరుళ్ మోహన్‌ను అనుకున్నారట. కానీ తాజాగా ఈ బ్యూటీ తప్పుకోవడంతో.. ఆ ఛాన్స్ కృతిశెట్టికి వరించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో కృతి సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టడమే కాదు.. అటు తమిళ్.. ఇటు తెలుగులోను మోస్ట్ వాంటేడ్ హీరోయిన్‌గా మారిపోయిందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!