పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.నటుడు అలాగే దర్శకుడు అయిన నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సీతం అనే సినిమా ను రీమేక్ గా తెలుగులో బ్రో ది అవతార్ గా తెరకెక్కిస్తున్నారు.. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా పెరిగాయి.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాలో పవన్ తన పార్ట్ షూట్ ఎప్పుడో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమా షూట్ మొత్తం చివరి దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి వచ్చిన వరుస పోస్టర్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది.ఇప్పుడు టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ టీజర్ పై తాజాగా ఒక అప్డేట్ అయితే బాగా వైరల్ అవుతుంది.రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారని సమాచారం.. ఈ టీజర్ నిముషం కంటే ఎక్కువ నిడివితో ఉంటుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం..ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టీజర్ పై ఒక క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నే నిర్మిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ను జులై 28న భారీగా విడుదల చేస్తున్నట్లు సమాచారం.