Bramayugam: ఫ్యాన్స్ కు చేదువార్త.. మెగాస్టార్ సినిమా తెలుగులో వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bramayugam: వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.
ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది. ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో సీటు అంచున కూర్చొని ఈ సినిమా చూడటం ఖాయమనేది ట్రైలర్ తో అర్థమైంది. అలాగే ట్రైలర్ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది.
Also Read
‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో తెలుగు మెగాస్టార్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. మరి ఈ సినిమా అసలు తెలుగులో రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!