Brahmanandam: యానిమల్ బ్రహ్మానందం వెర్షన్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam Animal Version Video Goes Viral: యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. మొదటి రోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు, మూడో రోజు 356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.563 కోట్లతో దూసుకుపోతుండగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sandeep Reddy Vanga : చిరంజీవి గారితో అలాంటి సినిమా చేయాలని వుంది..
Also Read
నిజానికి సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 10 తరాలకు సరిపడా మీమ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ ఇచ్చాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో పలు సినిమాల్లో ఆయన పాత్రలకు సంబంధించిన వీడియోలతో ఒక యానిమల్ వెర్షన్ వీడియో రూపొందించారు. 1 నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘యానిమల్’ బ్రహ్మీ తండ్రిగా నాజర్‌ను చూపించారు. బాద్ షా సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలను ఇలా ఫన్నీగా యానిమల్ వెర్షన్ లో క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Nice edit. Brahmi as #Animal!
— idlebrain jeevi (@idlebrainjeevi) December 9, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..