Boycott RRR in Karnataka సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కన్నడిగులు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారంటే… స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దిగజా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చ్ 25న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు సాగించిన ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు.
Read Also : Ramarao On Duty : రిలీజ్ డేట్ లాక్… ఎప్పుడంటే ?
అయితే వాళ్లకు షాక్ ఇచ్చేలా Boycott RRR in Karnataka అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే RRR కర్ణాటకలోని బెంగళూరులో తెలుగులో మాత్రమే విడుదల కానుంది. ఇది కన్నడిగులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అక్కడి ప్రజలు రాజమౌళిని ట్రోల్ చేస్తూ, స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కర్ణాటకలో “ఆర్‌ఆర్‌ఆర్” సినిమాను కన్నడలో విడుదల చేయకపోవడం కన్నడిగులకు ఘోర అవమానమని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలో భారీగా జరిగినప్పటికీ సినిమాను తమ మాతృ భాషలో విడుదల చేయకపోతే ఒప్పుకోమని అంటున్నారు. మరి జక్కన్న ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
