BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BoyapatiRAPO: రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమా తరువాత రామ్.. గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించేసుకున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బోయపాటి శ్రీనుతో రామ్ కలిశాడు. BoyapatiRAPO ను పట్టాలెక్కించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంకేంటి.. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబో గురించే మాట్లాడుకొనేలా చేసేశారు. ఇస్మార్ట్ శంకర్ తో చాక్లేట్ బాయ్ ను కాస్తా మాస్ హీరోగా మార్చాడు పూరి. ఇక ఈ సినిమాతో ఊర మాస్ హీరోగా మార్చేశాడు బోయపాటి. ఆయన సినిమాలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ లలో మాస్ కు మొగుడు అనగానే బోయపాటి పేరే వినిపిస్తోంది.
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పిక్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ సరసన హాట్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం రామ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడని టాక్ వినిపించింది. తాజాగా అది నిజమని తెలిసిపోయింది. ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని మేకర్స్ తాజాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా రామ్ లుక్ ను కూడా రివీల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక రామ్ లుక్ అయితే.. ఊర మాస్ కు ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నాడు అని చెప్పాలి. గుబురు గడ్డం.. గాగుల్స్.. సీరియస్ లుక్ తో ఒక ఎద్దును లాక్కెళుతూ కనిపించాడు. వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా తీక్షణంగా చూస్తే.. విలన్స్ ను బాది, ఎద్దును తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బోయపాటి.. రామ్ ను పూర్తిగా వాడేసుకున్నాడని అర్ధమవుతోంది. ఇప్పటివరకు చూసినా రామ్ వేరు.. బోయపాటి సినిమా హీరో వేరు అన్నట్లు ఉంది. వస్తున్నాం అంటూ రామ్ ఈ పోస్టర్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ చూసిన వాళ్లందరూ బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే అని షాక్ తింటున్నారు. మరి ఈ సినిమాతో రామ్ రేంజ్.. ఏ రేంజ్ కు మారుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు