Arjun Kapoor: మా సహనాన్ని చేతకానితనం అనుకోకండి.. బాయ్ కాట్ ట్రెండ్ పై మలైకా బాయ్ ఫ్రెండ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Kapoor: ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. స్టార్ హీరోల సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్, హీరో అర్జున్ కపూర్ నోరు విప్పాడు. వీటివలనే హిందీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన అర్జున్ మాట్లాడుతూ “ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది.. ఇప్పటివరకు దీనిపై మేము మాట్లాడకుండా తప్పుచేసాం. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాలీవుడ్ మనుగడ కోల్పోతోంది. మన ట్యాలెంట్ ను మన సినిమానే చూపిస్తుంది అని నమ్మడం వలనే మేము సైలెంట్ గా ఉన్నాం.
మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు. ఈ విషయంపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఇకపై వీటిపై దృష్టి పెట్టేలా స్టార్లు అందరు ఏకంగా పోరాటం చేయాలి. ఇలాంటి ట్రెండ్స్ సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అర్జున్ కపూర్ ను సపోర్ట్ చేయడానికి ఏఏ హీరోలు ముందుకు వస్తారో చూడాలి. ఇక అర్జున్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ లో అర్జున్ కపూర్ నటించాడు. త్వరలోనే మరోకొత్త ప్రాజెక్ట్ లో నటించనున్నాడు.
Also Read
- Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో 'అనిల్ మార్క్' నవ్వుల వర్షం!
- Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. 'స్పిరిట్' సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
- Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ - బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
- Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ 'డైమండ్ ఇయర్ రింగ్స్' కొట్టేశారు
తాజావార్తలు
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
-
NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
-
Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!