Madhuri Dixit: ఈ నాటికీ కనువిందు చేస్తోన్న మాధురి అందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు మాధురీ దీక్షిత్ తెరపై కనిపిస్తే చాలు అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించేది. ఇప్పుడు అభినేత్రిగానూ అదే తీరున మురిపిస్తున్నారు మాధురీ దీక్షిత్. గత సంవత్సరం మాధురి నటించిన ‘మజా మా’ చూసిన వారెవరికైనా ‘ఆంటీ అందం… అదరహో…’ అనిపించక మానదు. నవతరం ప్రేక్షకులు సైతం మాధురి అందాల అభినయానికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ మాధురి ఏ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలనీ ఆసక్తితో ఉన్నారు. అందాల మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ఎందరో రసికుల స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషిక్తురాలయింది. బహుశా, ఇప్పటికీ వారి కలల రాణిగా రాజ్యమేలుతూనే ఉండవచ్చు. ఎందుకంటే, మాధురి దీక్షిత్ అందాల అభినయమే కాదు, ఆమె నాట్యం సైతం యువకులను జివ్వు మనిపించేది.
అసలు మాధురి నాట్యం కోసమే జనం సినిమాలకు పరుగులు తీసేవారు. ఆ మాటకొస్తే – మూడేళ్ళ ప్రాయంలోనే మాధురి నాట్యం చేయడం ఆరంభించింది. ఆమెలోని ప్రతిభను గమనించిన కన్నవారు ప్రోత్సహించారు. కథక్ లో శిక్షణ ఇప్పించారు. దాదాపు ఎనిమిదేళ్ళు కథక్ నాట్యం అభ్యసించిన మాధురీ దీక్షిత్ తన నాట్యంతో ఇట్టే జనాన్ని కట్టిపడేసేవారు. చదువుకొనే రోజుల్లోనే మాధురీ దీక్షిత్ ఆటపాటల్లోనూ తనదైన బాణీ పలికించారు. స్కూల్ డే, కాలేజ్ డే ఎక్కడైనా మాధురీ నృత్యం ఉండాల్సిందే. మైక్రోబయాలజీలో బియస్సీ చేస్తూ ఉండగానే చదువుకు స్వస్తి పలికి, చిత్రసీమవైపు అడుగులు వేశారామె. హిరేన్ నాగ్ రూపొందించిన ‘అబోధ్’లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మాధురి. తరువాత “ఉత్తర్ దక్షిణ్, మోహ్రే’ చిత్రాల్లో నటించారామె. అయితే అనిల్ కపూర్ తో యన్.చంద్ర తెరకెక్కించిన ‘తేజాబ్’ ఆమెను రాత్రికి రాత్రి సూపర్ హీరోయిన్ గా నిలిపిందని చెప్పవచ్చు. ఇందులో “ఏక్ దో తీన్…” పాటలో మాధురీ దీక్షిత్ నృత్యం కుర్రకారును కిర్రెక్కించింది. యువకులకు నిద్ర లేకుండా గిలిగింతలు పెట్టింది. ఆ పై అనిల్ కపూర్ తో మాధురి నటించిన “రామ్ లఖన్, పరిందా, బేటా” వంటి చిత్రాలు ఉర్రూత లూగించాయి. ఆమిర్ ఖాన్ తో నటించిన ‘దిల్’, సంజయ్ దత్ తో మురిపించిన ‘సాజన్’,’ఖల్ నాయక్’, సల్మాన్ ఖాన్ తో అభినయించిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’, షారుఖ్ ఖాన్ తో అలరించిన ‘దిల్ తో పాగల్ హై’ వంటి సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. అన్నిటా మాధురీ దీక్షిత్ అందం అగ్రతాంబూలం అందుకుందని చెప్పవచ్చు.
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
మాధురీ దీక్షిత్ అడుగు పెట్టే నాటికి శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి తమదైన నృత్యంతో అలరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మాధురీ దీక్షిత్ తానూ నాట్యంతో పరవశింప చేయగలనని నిరూపించుకున్నారు. సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వంలో మాధురీ దీక్షిత్ నర్తించిన గీతాలు యువతను విశేషంగా ఆకర్షించాయి. ఆ తరువాతి రోజుల్లోనూ మాధురీ దీక్షిత్ తనదైన అభినయంతో సాగారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుసేన్ తనకంటే వయసులో ఎంతో చిన్నదైన మాధురి అందం చూసి బందీ అయిపోయారు. మాధురితో ఆయన ‘గజగామిని’ అనే చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో రూపొందించి, ఆమె అందానికే ఓ నివాళిగా అందించడం విశేషం! పెళ్ళయి పిల్లల తల్లి అయినా, ఇప్పటికీ మాధురీ దీక్షిత్ లోని ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు భావిస్తూనే ఉంటారు. మరి మాధురి మళ్ళీ ఏ సినిమాతో తన అభిమానులకు కనువిందు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!