టాలీవుడ్ లో ఇప్పుడు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. అయితే ఈ వార్ లో థమన్ దే పై చేయిగా ఉన్నట్లు టాక్. బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ ఆ థమన్ కే ఓటేస్తున్నారట. అయితే ఇక్కడో లెక్క ఉంది. దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ మాత్రం జై కొడుతోంది. ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి15 నుండి సాజిద్ నడియాడ్‌వాలా, నితేష్ తివారీతో మొదలు పెట్టబోతున్నాడు. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. సౌత్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అది ‘పుష్ప’ మహిమ అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ
నిజానికి బాలీవుడ్‌లో ఓ సినిమాకి పలువురు సంగీత దర్శకులతో మ్యూజిక్ కంపోజ్ చేయించుకునే ట్రెండ్ నడుస్తోంది. అయితే దానికి భిన్నంగా ఈ సినిమా ఆల్బమ్ మొత్తాన్ని దేవిశ్రీ కంపోజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే రణవీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ సినిమా కోసం డీఎస్పీ ఇటీవల రెండు పాటలను కంపోజ్ చేశారు. తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, రంగ రంగ వైభవంగా’ సినిమాలు చేస్తున్నాడు దేవి. ఇవి కాకుండా పలు బాలీవుడ్ సినిమా దర్శకనిర్మాతలు దేవిశ్రీతో మ్యూజిక్ చేయించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి బాలీవుడ్ లో బిజీ అవుతున్న దేవి ఆ సినిమాలతో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.