సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో… రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ బయటకి వచ్చి అనిమల్ సినిమాపై హైప్ ని మరింత పెంచింది. ఈ రేంజ్ హైప్ ఒక బాలీవుడ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సౌత్ లో అయితే రాలేదు. నార్త్ కి పోటీగ సౌత్ లో అనిమల్ కలెక్షన్స్ ఉండేలా ఉన్నాయి. మూడున్నర గంటల నిడివి ఉన్నా కూడా ఆడియన్స్ అనిమల్ సినిమాని చూడడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చింది అంటే అడల్ట్స్ కి మాత్రమే అని అర్ధం. హింస, బోల్డ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు A సర్టిఫికేట్ ఇస్తారు, దీని కారణంగా ఇప్పుడు అనిమల్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అనిమల్ మూవీని A సర్టిఫికేట్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి దూరం చేసేలా కనిపించట్లేదు. ఎందుకంటే అనిమల్ మూవీ కథలోనే ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధం ఉంది. ఈ పాయింట్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఇదిలా ఉంటే అసలు A సర్టిఫికేట్ తో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏంటో చూద్దాం. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమా A సర్టిఫికేట్ తోనే 380 కోట్లు రాబట్టింది. ది కాశ్మీర్ ఫైల్స్ 340 కోట్లు, ది కేరళ స్టోరీ 300 కోట్లు, OMG 2 225 కోట్లు… ఈ సినిమాలు A సర్టిఫికేట్ తోనే అన్ని కోట్లని కలెక్ట్ చేసాయి కాబట్టి సినిమాలో విషయం ఉంటే ఏ సర్టిఫికేట్ ఆడియన్స్ ని సినిమా నుంచి దూరం చేయలేవు. మరి అనిమల్ సినిమా థియేట్రికల్ రన్ లో ఎంత వసూల్ చేస్తుంది అనేది చూడాలి.