బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అందరికీ సుపరిచితమే. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇష్క్ విష్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన షాహిద్ తరువాత అనేక సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను అందించలేదు. అయినా పట్టు విడవకుండా షాహిద్ తన ప్రతిభను కనబరిచారు. వైవిధ్యమైన కథలతో స్టార్ హోదాను సంపాదించుకున్నారు. తాజాగా షాహిద్ తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈరోజు షాహిద్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. నేడు షాహిద్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ తారలు అతడిని విష్ చేశారు. అతడితో ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్న తెలుగు బ్యూటీ రాశి ఖన్నా కూడా తన విషెస్‌ను తెలిపారు. ఇక అభిమానులైతే విషెల్ విల్లువ కురిపించారు.